Magazines

సాకారమైన అశ్వారావుపేట వాసుల కల

5 గంటల క్రితం

Horticultural College
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

- ప్రారంభమైన ఉద్యాన కళాశాల

- ఫలించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారె కృషి

- హెచ్‌ఆర్‌ఎస్‌ ప్రాంగణంలో తరగతులు ప్రారంభం

- తొలివిడతలో ఎనిమిది మంది విద్యార్థుల చేరిక

నవతెలంగాణ - అశ్వారావుపేట

ఉద్యాన పంటలకు నెలవైన అశ్వారావుపేటలో ఉద్యాన కళాశాల ఏర్పాటు చేయాలన్న ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది.  స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం (హెచ్‌ఆర్‌ఎస్‌) ప్రాంగణంలోని పరిశోధనా భవనంలో మంగళవారం కళాశాల తరగతులు ప్రారంభమయ్యాయి. అశ్వారావుపేటలో ఉద్యాన కళాశాల ఏర్పాటు చేస్తానని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇచ్చిన హామీకి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషి తోడవడంతో ఈ కల సాకారమైంది. 


ఈ మేరకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అశ్వారావుపేటలో ఉద్యాన కళాశాల ఏర్పాటుకు అనుమతించింది.

2026 మే 14 న కళాశాల భవన సముదాయ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఘనంగా శంకుస్థాపన చేశారు. అనంతరం అక్టోబర్ 9 న నూతన కళాశాలకు అసోసియేట్ డీన్‌గా డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్‌ను నియమిస్తూ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు మొత్తం 30 సీట్లు కేటాయించగా, కళాశాల ప్రారంభం నాటికి ఇద్దరు బాలురు, ఆరుగురు బాలికలు కలిపి ఎనిమిది మంది విద్యార్థులు చేరారు. విద్యార్థులకు బాలురు, బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పించింది. మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మరో అవకాశం కల్పిస్తూ విశ్వవిద్యాలయం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యాన పంటల సాగుకు ప్రసిద్ధిగాంచిన అశ్వారావుపేటలో కళాశాల ప్రారంభం కావడం ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యాన విద్యను స్థానికంగానే అభ్యసించే అవకాశాన్ని కల్పించనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్