Magazines

ఇందిరమ్మ కుటుంబ జీవన బీమాపై అవగాహన

5 గంటల క్రితం

Understanding
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

- అర్హులైన ప్రతి కుటుంబానికీ బీమా భద్రత కల్పించాలి

- మండలంలో 100 శాతం నమోదు లక్ష్యం : ఎంపీడీవో వాల్మీకి కిశోర్ 

నవతెలంగాణ - అశ్వారావుపేట

పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని ఎంపీడీఓ వాల్మీకి కిషోర్ సూచించారు. మంగళవారం అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో సూపర్‌వైజర్లు, గ్రామపంచాయతీ ఇన్‌చార్జిలు, సర్పంచులతో ఈ పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీఓ కిశోర్ మాట్లాడుతూ కుటుంబ పెద్ద అకాల మరణంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. Understandingఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పధకం పధకం పై సమావేశం

మండలంలోని అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి, ఒక్క లబ్ధిదారుడు కూడా పథకానికి దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని సూపర్‌వైజర్లు, గ్రామపంచాయతీ ఇన్‌చార్జిలకు సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హుల నుంచి దరఖాస్తులు సేకరించాలని సర్పంచులను కోరారు. ప్రజలకు పథకంపై సంపూర్ణ అవగాహన కల్పించి మండలవ్యాప్తంగా 100 శాతం నమోదు సాధించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ దాసరి కిశోర్, సూపర్‌వైజర్లు,గ్రామపంచాయతీ ఇన్‌చార్జిలు, సర్పంచులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్