Magazines

ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలి

1 గంట క్రితం

Welfare schemes
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

- ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సొసైటీ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ వెంకటేశ్వరరావు

నవతెలంగాణ-సత్తుపల్లి 

​ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోని ప్రతి అర్హుడికీ అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ డెవలప్‌మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ వెంకటేశ్వరరావు కోరారు. హరిజన, గిరిజన ప్రాంతాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన విద్య, వైద్యం, ఉపాధి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. పేదరికాన్ని నిర్మూలించి, వారి జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా యంత్రాంగం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పిల్లి రత్నాకర్, సుండ్రు శోభనాచలం, పల్లం సంధ్యారాణి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్