సర్పంచ్ దొడ్డికింది సర్వేశ్
నవతెలంగాణ - ముధోల్
గ్రామంలో మహిళ సంఘాలకు అన్ని రంగాల్లో రాణించుంటకు గ్రామ పంచాయతీ పాలకవర్గం అండగా ఉంటుందని సర్పంచ్ దొడ్డికింది సర్వేశ్, ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్ లు అన్నారు. ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో గురువారం రోజు వీ బీజిరామ్ జీ పథకం కింద రూ.10 లక్షలతో మంజూరైన గ్రామ సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
మహిళా సంఘాల సభ్యులకు పతి నెల సమావేశం నిర్వహించడానికి ప్రత్యేక భవనం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక భవనానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వారు అన్నారు. ఈ భవనాన్ని త్వరగా నిర్మాణం పూర్తిచేసి గ్రామ సమైక్య సభ్యులకు అప్పగిస్తానని వారు చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు, మండల అధికారులకు, మహిళా సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లవకూమార్, ఎపిఓ శీరీష, ఎపిఎం గురు చరణ్,పంచాయతీ కార్యదర్శి రమ్య, వివో అధ్యక్షురాలు గట్టుపల్లి రజిత, ఐకేపి సిసి జ్యోతి, విఓఎ లత వార్డుసభ్యులు, మహిళలు, నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)