Magazines

పార్లమెంట్ వద్ద అగ్నిప్రమాదం

1 గంట క్రితం

Parliament
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

మరమ్మతులతో మంటలా..

లేక గుట్టుగా ఫైళ్లు కాల్చేశారా..?

ఉద్యోగ వర్గాల్లో చర్చ
గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సమీపంలో ఉన్న నార్త్ బ్లాక్‌లో సోమవారం అగ్నిప్రమాదం కలకలం రేపింది. భవనం నుంచి భారీగా పొగలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలను అక్కడికి పంపించారు. వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే సోమవారం ఉదయం 11.10 గంటలకు నార్త్ బ్లాక్‌ నుంచి పొగలు వస్తున్నట్టు ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. భవనంలో మరమ్మతుల పనులు జరుగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ పనుల సమయంలోనే చిన్నపాటి మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. నార్త్ బ్లాక్‌ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన కార్యాలయాలు ఉన్న భవనం.

ఇందులో కేంద్ర హోం శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉన్నాయి. పార్లమెంట్‌ భవనానికి సమీపంలోనే ఇది ఉంటుంది. దీంతో ఆ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. శివసేన ఎంపీ మిలింద్ దేవ్‌రా పార్లమెంట్‌కు సోమవారం వెళ్తున్న సమయంలో నార్త్ బ్లాక్‌ వెనుక వైపు నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించారు. ఆ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పొగలకు సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు. అయితే, మంటలు రావడానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. భవనానికి ఎంతమేర నష్టం జరిగిందనే వివరాలు కూడా వెల్లడించలేదు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మరమ్మతుల వల్లే మంటలా..లేక కీలకమైన ఫైళ్లను కాల్చేశారా..అనే చర్చ ఉద్యోగవర్గాల్లో నడుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్