Magazines

పెంటగాన్‌ కొత్త ప్రణాళిక

1 గంట క్రితం

Pentagon's new plan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 2 నిమిషాల చదవడం

అమెరికా సైనిక స్థావరాలకు 90 రోజుల స్వయం సమృద్ధి లక్ష్యం

విద్యుత్‌ సరఫరా నిలిచినా, సరుకుల రవాణా ఆగినా యుద్ధం కొనసాగించేలా ప్లాన్‌

పౌర మౌలిక సదుపాయాలపై ఆధారపడటాన్ని తగ్గించే ‘ఫోర్ట్రెస్‌’ కార్యక్రమం

వాషింగ్టన్‌ : అమెరికా గడ్డపై భారీ యుద్ధం జరిగి విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతిన్నా, సరుకుల సరఫరా గొలుసులు తెగిపోయినా సైనిక కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్‌) కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన సైనిక స్థావరాలు బయటి సహాయం లేకుండానే కనీసం 90 రోజుల పాటు పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్‌, నీరు, ఇంధనం, సమాచార వ్యవస్థలు అందు బాటులో ఉండేలా చర్యలు తీసుకోనుంది. ఫాక్స్‌ న్యూస్‌ డిజిటల్‌.. పరిశీలించిన పత్రాలను ఉటంకిస్తూ ఈ వివరా లను వెల్లడించింది. ‘ఫోర్ట్రెస్‌’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతి న్నా అమెరికా సైన్యం యుద్ధ కార్యకలాపాలను కొనసాగిం చగలిగేలా చూడనున్నారు. జాతీయ రక్షణ వ్యవస్థను నడిపేందుకు పౌర మౌలిక సదుపాయాలు, ఇతర ప్రభుత్వ సేవలపై ఆధారపడటం ప్రమాదకరమని పెంటగాన్‌ అధి కార ప్రతినిధి సీన్‌ పార్నెల్‌ పేర్కొన్నారు. విద్యుత్‌ లేకపోతే సమాచార వ్యవస్థలు, నీటి సరఫరా, రవాణా, ఆయుధాల తయారీ, సైనిక ఆదేశాల వ్యవస్థలు దెబ్బతింటాయని ఆయన వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా పోర్టబుల్‌ అణు రియాక్టర్లు, భారీ బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, స్థానిక విద్యుత్‌ గ్రిడ్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అవసరమైనప్పుడు సైనిక స్థావరాలను సాధారణ విద్యుత్‌ గ్రిడ్‌ నుంచి వేరు చేసుకుని పనిచేసేలా వీటిని రూపొందిం చనున్నారు. అలాగే ఆయుధాలు, ఇంధనం, ఇతర కీలక వస్తువుల కొరత రాకుండా ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు, వ్యూహాత్మక నిల్వలను అభివృద్ధి చేయనున్నారు. యుద్ధ పరిస్థితులు తలెత్తినప్పుడు పౌర పరిశ్రమలను రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి మళ్లించే ఏర్పాట్లు కూడా ఈ ప్రణాళికలో ఉన్నాయి. రెండు మహాసముద్రాలు అమెరి కాను రక్షిస్తాయనే పాత అంచనాలతో ఇక ముందుకు వెళ్లలేమని పార్నెల్‌ అన్నారు. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గోల్డెన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థ, పశ్చిమార్థగోళంపై దృష్టి, గ్రీన్‌లాండ్‌, పనామా అంశాల ద్వారా కొత్త రక్షణ విధానా నికి మార్గం వేశారని ఆయన వివరించారు. అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఎనిమిదో నెలకు చేరువవుతున్న నేపథ్యం లో ఈ ప్రణాళిక వెలుగులోకి వచ్చింది. దేశంలోనే కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నా సైనిక సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్