Magazines

గాయపడిన కండక్టర్ ప్రవళికకు అండగా ఉంటాం : ఈడీ వెంకన్న

59 నిమిషాల క్రితం

We will stand by the injured conductor, Pravalika: ED Venkanna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

మెరుగైన వైద్యం అందించాలి : 
మంత్రి పొన్నం, ఎండీ నాగిరెడ్డి

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

విధినిర్వహణలో ఉండగా ప్రయాణికురాలి దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణుగూరు డిపో ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళికను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. వెంకన్న పరామర్శించారు. సోమవారం పలువురు అధికారులతో కలిసి సాయిసంజీవని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రవళిక ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాయపడిన ప్రవళికకు మెరుగైన వైద్యం అందించాలనీ, వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆసుపత్రి వైద్యులకు ఈడీ వెంకన్న సూచించారు. అనంతరం బాధితురాలు ప్రవళికతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఈడీ వెంకన్న, వారికి ధైర్యం చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రవళికకు ఎల్లవేళలా అండగా ఉంటుందనీ, ప్రవళిక కు సంస్థ అన్ని విధాలా సంపూర్ణ భరోసా కల్పిస్తుందని స్పష్టం చేశారు. కండక్టర్‌పై దాడికి పాల్పడ్డ నిందితురాలిపై చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అదేవిధంగా ప్రవళిక ఆరోగ్య పరిస్థితి పై ఎప్పటికప్పుడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి లు వైద్యులతో మాట్లాడుతూ ప్రవళిక కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్