నవతెలంగాణ-పూడూర్
వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని ఓ వ్యవసాయ క్షేత్రం దగ్గర విద్యుత్ సక్రమంగా రాకపోవడం, మళ్లీ మళ్లీ కరెంటు ఫీజు ఎగిరిపోవడం చూసిన రైతు మంగలి లింగయ్య తానే ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు. ఉదయం నుంచి వేచి చూసి వేచి చూసి విద్యుత్ అధికారులు ఎవరూ అక్కడికి రాకపోవడంతో తానే ప్రాణాలను పణంగా పెట్టి ఎల్సీ తీసుకోకుండానే ట్రాన్స్ ఫార్మర్ ను ఆఫ్చేసి పైకి ఎక్కాడు. ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రతిరోజూ కరెంట్ వచ్చిన 20 నిమిషాలు మాత్రమే పనిచేస్తోంది. తరచూ వైర్లు కాలిపోతున్నాయి. ఫీజు వైర్లు ఖాళిపోతున్నాయని విద్యుత్ అధికారులకు విన్నవించినా.. ఓవర్ లోడ్ కారణంగా అలా జరుగుతుందని అంటున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని రైతు తెలిపారు.






కామెంట్లు (0)