Magazines

ఆర్థిక వ్యవస్థలపై దాడులే ఆధునిక యుద్ధాలు

1 గంట క్రితం

warfare
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 2 నిమిషాల చదవడం

బ్యాంకింగ్‌ రంగానికి సైబర్‌ ముప్పు : ప్రధాని మోడీ

భువనేశ్వర్‌లో ఆర్బీఐ 
రూ.169 కోట్ల డేటా సెంటర్‌, సైబర్‌ భద్రత శిక్షణ సంస్థ ప్రారంభం


భువనేశ్వర్ : ప్రస్తుత యుద్ధాలు సంప్రదాయ ఆయుధాలతోనే కాకుండా ఆర్థిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని కూడా జరుగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ ఉగ్రవాదుల నుంచి భారత బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఒడిశాలో 169 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్‌ సెక్యూరిటీ శిక్షణా సంస్థను.. మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని తమ దృష్టిలో అభివృద్ధి అంటే దేశ సమగ్రాభివృద్ధితో పాటు గ్రామాలు, చిన్న పట్టణాలకు అవకాశాలు కల్పించడమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగం ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా పనిచేస్తూ ప్రజలకు 24 గంటలూ సేవలు అందిస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం కొందరు ధనవంతులు, పలుకుబడి ఉన్నవారికి మాత్రమే బ్యాంకింగ్ సేవలు అందేవని, పేదలు, మధ్యతరగతి వారు, మహిళలకు రుణాలు దక్కేవికావని మోడీ విమర్శించారు. 2014తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఒకప్పుడు లగ్జరీగా భావించిన డెబిట్, క్రెడిట్ కార్డులు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. 'నేడు యుద్ధాలు కేవలం ఆయుధాలతో మాత్రమే జరగవని మనందరికీ తెలుసు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై దాడులు చేయడం ద్వారా కూడా ఆ దేశాన్ని బలహీనపరచవచ్చు. భారత్‌ ఆర్థికంగా బలపడుతున్న తరుణంలో, మన బ్యాంకింగ్ వ్యవస్థను సైబర్ నేరస్థులు, సైబర్ ఉగ్రవాదుల నుంచి రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. నేడు, సైబర్ ముప్పుల రూపురేఖలు నిరంతరం మారుతున్నాయి. పాతబడిన వ్యవస్థలు, పాత శిక్షణా పద్ధతులు లేదా కాలం చెల్లిన సాధనాలతో ఈ కొత్త సవాళ్లను మనం ఎదుర్కోలేం. మనకు ఆధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. ఇక్కడే ఈ కొత్త సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కీలక పాత్ర పోషించనుంది' అని ప్రధాని మోడీ అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్