Magazines

దాడుల వేళ..సౌదీలో ఫొటోలు తీయొద్దు

53 నిమిషాల క్రితం

Saudi Arabia attacks
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

భారత ఎంబసీ అలర్ట్‌
న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని రాయబార కార్యాలయం పేర్కొంది. ఏమైనా వైమానిక దాడులు జరిగితే.. తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. దాడులు జరిగినప్పుడు ఒకవేళ గదిలో ఉంటే కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా అక్కడ జరిగే ఘటనలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు తీయడం, వాటిని ఇతరులతో పంచుకోవడం చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు రియాద్‌లో ఉన్న భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. గాయపడిన భారత పౌరులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులను ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు సందర్శిస్తూనే ఉన్నారు. వారి కుటుంబీకులను నిరంతరం సంప్రదిస్తూ అవసరమైన సాయాన్ని అందిస్తున్నారు.రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం విమాన కార్యకలాపాలు కొనసాగడం లేదు. కొంత అంతరాయం ఉన్నప్పటికీ దమామ్‌, జిద్దా, మదీనా ఎయిర్‌పోర్టులు మాత్రం కొనసాగుతున్నాయి.

భారత్‌కు చెందిన విమానయాన సంస్థలు సౌదీ అరేబియాకు తాత్కాలికంగా సర్వీసులు నిలిపివేశాయి. అక్టోబర్‌ 24 వరకు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఇండిగో సర్వీసులు నిలిపివేయగా.. ఆకాశ ఎయిర్‌ అక్టోబర్‌ 27 వరకు సర్వీసులు నిలిపివేసింది.భారత్‌ నుంచి దమామ్, జిద్దా, మదీనాలకు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. భారత్‌ నుంచి అత్యవసరంగా వెళ్లేవారు బహ్రెయిన్‌, కువైట్‌ లేదా ఖతర్‌ మార్గాలను ఎంచుకోవచ్చు. ఉమ్రాతోపాటు సౌదీకి వెళ్లాలని భావించే భారత పౌరులు అక్కడి ఎయిర్‌పోర్టులో అంతరాయాలు, విమానాల రద్దును దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో భారత కాన్సులేట్‌, ఎంబసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని ఎంబసీ పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్