Magazines

ఇంతలా భయపడే ప్రధాని దేశంలో ఎన్నడూ లేరు

1 గంట క్రితం

The country has never had a Prime Minister who is so fearful.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 2 నిమిషాల చదవడం

మోడీ ప్రభుత్వంపై సీజేపీ నేతల తీవ్ర విమర్శలు

ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు

నిర్బంధం నుంచి విడుదలైనా వెనక్కి తగ్గేది లేదు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు పోరాటం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో దేశంలో ఇంతటి భయపడే ప్రధానిని ఎన్నడూ చూడలేదని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేత‌లు ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో పోలీసులు తమను నిర్బంధించినప్పటికీ, ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ప్రకటించారు. నిరసనకారులపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం పోలీసులు నిర్బంధం నుంచి విడుదల అయిన‌ అనంతరం ప్రెస్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సీజేపీ జాతీయ కో క‌న్వీన‌ర్లు అశుతోష్ రంకా, సౌరవ్‌ దాస్ మాట్లాడారు. ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన తమను విమానం దిగకముందే అదుపులోకి తీసుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తమను నిర్బంధించడంతో ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు.గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో నెలకొన్న పరిస్థితులు సిగ్గుచేటని అశుతోష్ రంకా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యవహారశైలి దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని విమర్శించారు. వేలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకోవడం, వారిపై దాడులు చేయడం, ప్రజల రాకపోకలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. తమను విమానంలోనే నిర్బంధించడం సాధారణ పోలీసు చర్య కాదని, తమ స్వేచ్ఛను హరించడమేనని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ గురించి గతంలో విన్నామని, అయితే గత 72 గంటల్లో జరిగిన పరిణామాలు అప్పటి పరిస్థితులను కూడా తలపిస్తున్నాయని పేర్కొన్నారు. రైలు సేవలకు అంతరాయం కలిగించడం, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం, నిరసనకారులను పెద్దఎత్తున నిర్బంధించడం ప్రజాస్వామ్య దేశంలో ఆమోదయోగ్యం కాదన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్