Magazines

జీవితకాల రక్షణపై మీ స్పందన ఏంటి ?

1 గంట క్రితం

protection
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 2 నిమిషాల చదవడం

ఈసీ చట్ట నిబంధన సవాలుపై కేంద్రానికి, ఈసీకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (‌సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలోని నిర్దిష్ట నిబంధన చెల్లుబాటును, రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వ స్పందనను సుప్రీం కోర్టు బుధవారం కోరింది. సీఈసీ, ఎన్నికల కమిషనర్లు పదవీకాలంలో వున్నపుడే కాకుండా వారు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా జీవితాంతం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా లేదా క్రిమినల్‌ ‌ప్రాసిక్యూషన్‌ ‌చేపట్టకుండా రక్షణ కల్పించే నిబంధనను పిటిషనర్లయిన ఆర్‌‌జేడీ ఎంపి మనోజ్‌ ‌ఝా, అడ్వకేట్‌ అరుణ్‌ ‌కుమార్‌ అగర్వాల్‌ సవాలు చేశారు. చీఫ్‌ జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌‌కు, నోటీసులు జారీ చేసింది.


ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సర్వీస్‌, పదవీకాల నిబంధనలు) చట్టం, 2023లోని 16వ సెక్షన్‌‌ను వీరు సవాలు చేశారు. కోర్టు దీనిపై విచారణను డిసెంబరు 18కి వాయిదా వేసింది. ఈ సెక్షన్‌ ‌రాజ్యాంగ విరుద్ధమైనదని పిటిషన్లు పేర్కొన్నాయి. ఎన్నికల కమిషన్‌‌కు ఇచ్చిన అధికారాల పరిధి రాజ్యాంగం మౌలిక వ్యవస్థనే ఉల్లంఘిస్తోందని ఆ పిటిషన్లు తెలిపాయి. ‘‘ఈ చట్టంలోని సెక్షన్‌ 16 ‌రాజ్యాంగ న్యాయస్థానాల పరిధిని నిషేధిస్తోంది. పైగా రాజ్యాంగ మౌలిక వ్యవస్థలో భాగంగా ఉండే జ్యుడీషియల్‌ ‌సమీక్ష అధికారాల్లో జోక్యం చేసుకుంటోంది.’’ అని పిటిషనర్లు వాదించారు. ‘‘స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు హామీ కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో తీసుకునే ఇటువంటి తీవ్రమైన చర్యలు దామాషా (ప్రపోర్షనాలిటీ) పరీక్షలో విఫలమవుతాయి. సమస్య పరిహారానికి, నిష్పక్షపాతమైన దర్యాప్తునకు ప్రతి వ్యక్తికి హక్కు ఉంటుంది.


న్యాయం అందుబాటులో ఉండడమనేది 14, 21 అధికరణల్లోని ఒక అంశం.’’ అని పిటిషనర్లు వాదించారు. రాజ్యాంగంలోని 361వ అధికరణ కింద రాష్ట్రపతి, రాష్ర్టాల గవర్నర్లు తమ అధికారపరమైన విధులను, అధికారాలను నిర్వర్తించేటపుడు వారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పిటిషన్లు పేర్కొన్నాయి. వారికి కూడా ఈ రక్షణ సంపూర్ణంగా ఉండదని, వారీ పదవీకాలం పూర్తయిన పిదప, వారికి నోటీసులిచ్చి సివిల్‌ ‌చర్యలు చేపట్టడానికి అనుమతి వుంటుందని, కానీ ఈసీ విషయంలో అటువంటిదానికి అవకాశం లేకుండా నిబంధన ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్