డిండికి శ్రీశైలం బ్యాక్ వాటర్ తెచ్చే ఆలోచన
రెండు ఎమ్మెల్సీలు మావే :ఇష్టాగోష్ఠిలో మంత్రి జూపల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రేట్లు పెంచింతే తాగుడు తగ్గుతుందని భావిస్తే... అలా కాకుండా ఆదాయం పెరుగుతోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్ లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. బీఆర్ఎస్ పదేండ్లలో 260 శాతం రేట్లు పెంచితే రూ.10 వేల కోట్ల నుంచి రూ.36 వేల కోట్లకు, తాము పెంచిన రేట్లతో రూ.4 వేల కోట్లకు ఆదాయం పెరిగిందని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికతోనే సగం గెలిచిందన్నారు. ఎన్నికలు జరిగే రెండు సీట్లను తామే గెలుస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కల్వకుర్తి పథకం కింద ఆయకట్టు2 లక్షల ఎకరాల నుంచి 4 లక్షలకు పెరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీంతో 2 లక్షల ఎకరాలకు నీటి కొరత వచ్చిందని చెప్పారు. దీనిపై చర్చించామనీ, డిండి కి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవాలనే ఆలోచన ఉందన్నారు. దాంతో తెలంగాణ పూర్తి వాటా వినియోగిం చుకోవచన్నారు. అధికారుల ను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుం టారన్నారు. బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు తీసుకుంటే అచ్చంపేట కి కూడా కలిసి వస్తుందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం నీళ్ళు ఇస్తుందనీ, ఇబ్బంది లేదని చెప్పారు. సాగు నీటి సమస్య ఉన్న మాట వాస్తవమనీ అంగీకరించారు. లండన్ లో కార్ వాష్, గార్డెనింగ్ కి కూడా నీళ్ళు వాడొద్దు అని చెబుతున్నారని ఉదహరిస్తూ, ప్రపంచమంతా కరువు ఉందని తెలిపారు.
చెమటలు సహజంగా వస్తాయి
చెమటలు ఎవరో పట్టిస్తే రావనీ, నాచురల్ గా వస్తాయని బీఆర్ఎస్ కొడంగల్ సభ సందర్భంగా చేసిన హెచ్చరికలను జూపల్లి కొట్టిపారేశారు. ఆస్తులపై వ్యవస్థలు చూసుకుంటాయనీ, సీఎం చెప్పిన అసైన్డ్ భూములపై నివేదిక వచ్చిన తర్వాత అంతా బయటికి వస్తుందని తెలిపారు. జూబ్లిహిల్స్ లో మాదిరి ఫలితాలే ఖైరతాబాద్ లో వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాను ఓడిపోతే కేటీఆర్ కూడా బాధపడ్డారనీ, కేసీఆర్ ను ప్లానింగ్ బోర్డు అడగాలనీ కేటీఆర్ తనకు సూచించినా తాను అడగలేదని తెలిపారు.
రేట్లు పెంచినా తాగుడు తగ్గట్లే..
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)