Magazines

ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి

55 నిమిషాల క్రితం

celebrations a grand success.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రభుత్వ విప్‌ రామచంద్రు నాయక్ పిలుపు
గిరిజన సంఘం నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్, ఆర్. శ్రీరాం నాయక్, భూక్యా వీరభద్రం, ఎం.బాలు నాయక్, వాంక్డోత్ వీరన్న, అశోక్ లతో కలిసి డాక్టర్ రామచంద్రు నాయక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభలు అక్టోబర్ 10,11 తేదీల్లో హైదరాబాద్ లో జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుతో నంగారా ఉత్సవాలను హైదరాబాద్ లోని పలక్ నామా ప్రాంతంలోని రవీందర్ నాయక్ నగర్ లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్టోబర్ 10 వ తేదీన ఉదయం.11.30 గంటలకు రవీందర్ నాయక్ నగర్ లోని లింబ్రా హోటల్ నుంచి కళా ప్రదర్శ ప్రారంభం అవుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన కళాకారుల ఆటపాటలతో ఉత్సవాలు రోజంతా జరుగుతాయని అన్నారు. గిరిజనుల సంస్కృతిని చాటి చెప్పే విధంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో తెలంగాణ వ్యాప్తంగా గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. పోరాడి అమరుడైన గిరిజన యోధుడు ఠానూ నాయక్ పేరు మీద జరగడం చాలా సంతోషకరమని అన్నారు. మారుతున్న గిరిజనుల జీవన విధానంతో గిరిజనుల సంస్కృతి,సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్