Magazines

నైపుణ్యంతో కొలువుల బాట

1 గంట క్రితం

Obs Through Skills
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 2 నిమిషాల చదవడం

సింగరేణి ఆర్జీ–1 నైపుణ్య శిక్షణ కేంద్రం నుంచి 112 మంది ఎంపిక
ఫాక్స్కాన్‌‌లో 87 మంది మహిళలకు అవకాశం


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలనిస్తోంది. రామగుండం–1 ఏరియాలోని సింగరేణి జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా తాజాగా 154 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 127 మంది మహిళా అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వారిలో 87 మంది హైదరాబాద్లోని ఫాక్స్కాన్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో 27 మంది పురుష అభ్యర్థులు సోలార్ టెక్నిషియన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వారిలో 25 మంది సోలార్ టెక్నిషియన్లుగా ఉద్యోగాల్లో చేరనున్నారు. ఫాక్స్కాన్కు ఎంపికైన మహిళల్లో తొలి విడతగా 55 మంది ఆదివారం గోదావరిఖని నుంచి హైదరాబాద్‌‌కు బయలుదేరారు. గత రెండేండ్లలో 500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించింది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. గత వారం జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో మహిళా అభ్యర్థులకు ప్రత్యేక ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించారు. హైదరాబాద్లోని కంపెనీ తయారీ కేంద్రంలో ఆపిల్ ఇయర్పాడ్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాల అసెంబ్లింగ్ విభాగాల్లో పనిచేసేందుకు 87 మంది మహిళలను ఎంపిక చేశారు. స్థానిక మహిళలకు పారిశ్రామిక రంగంలో లభించిన ఈ అవకాశాలు వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడనున్నాయి. సోలార్ టెక్నిషియన్ కోర్సులో శిక్షణ పొందిన 25 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆర్జీ–1 జీఎం డి. లలిత్ కుమార్ తెలిపారు. పది రోజుల్లో ఎల్ అండ్ ఎన్ కంపెనీలో ఉద్యోగాల్లో చరనున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల యువతకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని అన్నారు.కార్యక్రమంలో ఎస్వో టు జీఎం ఎస్.కె. చంద్రశేఖర్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, టాస్క్ మేనేజర్ డాక్టర్ కౌసల్య, ఎల్ అండ్ ఎన్ డైరెక్టర్ కౌశల్, ఫాక్స్కాన్ హెచ్ఆర్ ప్రతినిధి ఆర్. శ్రీనివాస్, జీవీటీసీ మేనేజర్ మాధవరెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్