నోటీసులు ఇచ్చాకే చర్యలుండాలి : హైకోర్టు స్పష్టం
హైదరాబాద్ : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై నమోదైన కేసులో చట్టప్రకారం నోటీసులు జారీ చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తె నైనిషా రెడ్డికి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో భాగస్వామ్యాలున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మెట్టు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అరెస్టు చేసే అవకాశాల నేపథ్యంలో క్రిశాంక్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను జస్టిస్ మాధవీదేవి విచారించారు. ఆర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేయాలని, ఆ తర్వాతే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దర్యాప్తునకు సహకరించాలని క్రిశాంక్‌కు సూచించి విచారణ ముగించారు.
మన్నె క్రిశాంక్‌కు ఊరట
43 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)