దిగువకు నీటిని విడిచిపెట్టిన ప్రభుత్వం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇది కాలం తెచ్చిన కరువు కాదనీ, కాంగ్రెస్ తెచ్చిన కరువని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదిక ద్వారా ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. జూన్ ఒకటి ఇప్పటి వరకు గోదావరి నీళ్లను 750 టీఎంసీలు, కృష్ణా నీళ్లను 250 టీఎంసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు విడిచిపెట్టిందని తెలిపారు. కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా కృష్ణా నీళ్లను వృథా చేశారని విమర్శించారు. ఎల్నినో వస్తున్నదని ఈ ఏడాది మార్చి నుంచే వాతావరణ నిపుణులు హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయిందని వివరించారు. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లను పారించిందని తెలిపారు.







కామెంట్లు (0)