Magazines

‘అ’ రిలీజ్‌కి రెడీ

2 గంటల క్రితం

'A' is ready for release
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ఎడిటర్ గ్యారీ బీహెచ్‌ నిర్మించిన చిత్రం ‘అ’. సాయి బాలి దర్శకుడు. ఈనెల 12న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. డైరెక్టర్ నందినీ రెడ్డి, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, హీరో ఆకాష్ పూరి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ,‘థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతుంటాయి. ఈ చిత్రంతో దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలి. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల ప్రధాన బలం’ అని తెలిపారు. ‘టీజర్, ట్రైలర్ బాగా నచ్చాయి. శ్రీ చరణ్ మ్యూజిక్ అదిరిపోయింది. కెమెరా వర్క్ బాగుంది. ఈ చిత్రంతో రాహుల్‌కి మంచి విజయం దక్కాలి’ అని ఆకాష్ పూరి చెప్పారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ, ‘టీజర్, ట్రైలర్ నాకు చాలా నచ్చిది. పోస్టర్ డిజైనింగ్, టైటిల్‌లోనే సినిమా కథను చెప్పడం బాగుంది. ఇండస్ట్రీలో ఇలాంటి నూతన దర్శక, నిర్మాతలు రావాలి. ‘శంబాల’తో అర్చన మంచి విజయాన్ని అందిం చింది. అదే సక్సెస్ ఇప్పుడు కం టిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాని అందరూ చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్