పి.ఎస్.జె. ఫిలిమ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’.
ఈ మూవీలో G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహ రాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈనెల 27న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య్రకమంలో నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ,‘ఈ మూవీకి 2 ఇయర్స్ నుంచి స్క్రిప్ట్ పై వర్క్ చేశాము. 27కి రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి’ అని అన్నారు.
‘నేను మంచి యాక్టర్స్‌తో కలిసి నటించాను. నా అదృష్టం ఇంత మంచి సీనియర్స్‌తో కలిసి నటించడం’ అని హీరో బెన్నీ చెప్పారు.
హీరోయిన్ జెస్సీ మాట్లాడుతూ, ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు థ్యాంక్స్’ అని అన్నారు. డైరెక్టర్ చాచా సురేందర్ మాట్లా డుతూ,‘నేను ప్లాన్ చేసుకున్న ప్రకారం చేయడానికి సహకరిం చిన నా నిర్మాతలకు చాలా చాలా కృతజ్ఞతలు అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ, ‘నేను ఇలాంటి సినిమాలు మన ఎస్‌కె పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేశాం. ఈసినిమా చాలా అద్భుత మైన సినిమా. అందరూ థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలని కోరుకుం టున్నా. సినిమా టికెట్ రేట్ కేవలం రూ.100 మాత్రమే. 60 ఏళ్ళు వచ్చిన సీనియర్స్ ఎవరైనా థియేటర్స్ వద్దకి వచ్చి ఆధార్ కార్డు చూపిస్తే సినిమా ఫ్రీగా చూడవచ్చు. అది కూడా 3 రోజుల వరకు మాత్రమే. ప్రతీ యువత కూడా ఈ సినిమా చూడాలి. వారు వయసు మళ్ళిన తరువాత వారి లైఫ్ కూడా ఇంతే అని కచ్చితంగా తెలుసుకుంటారు’ అని తెలిపారు.







కామెంట్‌లు (0)