Magazines

15 దేశాల్లో 'బాల 369' షూటింగ్‌

4 గంటల క్రితం

Bala
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

‘జయమ్మ పంచాయితీ’ ఫేం విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఆర్విన్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బాల 369’. ‘అటజని కంచె’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఆర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు మాట్లాడుతూ, '15 దేశాల్లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఇది. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. తెలుగు సాహిత్యంలో ఉన్న ఒక పద్యాన్ని ఆధారంగా చేసుకుని కథను రాశాను. సినిమా చూసిన తర్వాత మీరు గొప్ప అనుభూతిని పొందుతారు. మేము ఈ సినిమా కోసం ప్రతి దేశం తిరిగాం. ఎక్కడా కూడా వీఎఫ్‌ఎక్స్‌ ఉపయోగించలేదు. కథ ప్రకారం బిలీవబుల్‌గా ఉండడానికి అన్ని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. ఈ సినిమా కంటెంట్ నచ్చి వైవా హర్ష ప్రజెంట్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది' అని తెలిపారు. 'ఫస్ట్ టైమ్ హీరోగా చేస్తున్నాను. ఇది చాలా మంచి సినిమా. ఈ సినిమా ద్వారా నటుడిగా నాకు మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను' అని హీరో ఆర్విన్ తేజ్ చెప్పారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు, ప్రొడ్యూసర్స్: విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య, డీవోపీ: అనుష్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్: డా. శాండీ సి. ఆనంద్, ఎడిటర్: కార్తికేయన్ రోహిణి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్