Magazines

అందమైన ప్రేమకథా చిత్రం

22 నిమిషాల క్రితం

Beautiful love story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం

శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో సావిత్రమ్మ చెరుకూరు నిర్మించిన సినిమా ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. ఓ పక్క అమెరికాలో జాబ్‌ చేస్తూనే సినిమాపై ఉన్న మక్కువతో ఈ సినిమాకి దర్శకత్వం వహించారు రమేష్‌బాబు చెరుకూరు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈనెల 27 న విడుదలకు సిద్దమవుతోంది

ఈ చిత్రంలో హీరోగా మనోజ్ నటిస్తుండగా, హీరోయిన్లుగా శృతి, మోహన సిద్ధి నటించారు. హీరో తండ్రి పాత్రలో సుమన్, విలన్ పాత్రలో సర్కార్ కనిపించనున్నారు. హాస్యనటులు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు తమదైన శైలిలో నవ్వించబోతున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి

ఈ నేపథ్యంలో దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ, ‘నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. నా మనసులో ఉన్న సినిమా కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించాను. ప్రేక్షకుల ఆదరణ, ఆశీస్సులతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే టీజర్కి మంచి రెస్పాన్స్ రావడంతో చాలా సంతోషంగా ఉంది. నా ఆలోచనలు, అనుభవం, సృజనాత్మకతతో ప్రేక్షకులకు మంచి ప్రేమకథను అందించాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథా సినిమాలొచ్చాయి. వాటితో పోలిస్తే మా సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో ప్రతి సన్నివేశం ప్రేక్ష‍కులకు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆద్యంతం సరికొత్తగా సాగే సన్నివేశాలు ప్రేక్ష‍కులను బాగా అలరిస్తాయి. ఓ మంచి లవ్‌స్టోరీతో రావడం చాలా సంతోషగా ఉంది’ అని తెలిపారు.

ఈ సినిమాకి సమర్పణ: బాల బ్రహ్మ చారి, శివ బ్రహ్మిణి చెరుకూరు, నిర్మాత: సావిత్రమ్మ చెరుకూరు, దర్శకుడు: రమేశ్ బాబు చెరుకూరు, డి ఓ పి: దొసాడ యాదగిరి, సంగీత దర్శకుడు: సీ యన్ ఆదిత్యా, ఎడిటర్: లక్కీ ఎక్కరి, ఫైట్ మాస్టర్: తూఫాన్, కొరియోగ్రాఫర్లు: రమేశ్ బాబు చెరుకురు, రజని సాగర్, ఆర్ట్ డైరెక్టర్: నాని.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్