హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా సినిమా‘ఫ్యామిలీ ప్యాక్’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎంటర్టైనర్ 2027 సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో ఫుల్ ఫన్ బాగా వచ్చింది. డైలాగ్స్ కూడా అదిరిపోయాయి. ‘సామజవరగమన’ విజయ వంతమైన తర్వాత రామ్ అబ్బరాజుతో మరో సినిమా చేయాలనుకున్నాం. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో ఒక కొత్త యాంగిల్ ఉంటుంది. అది టీజర్లో, ట్రైలర్లో ఉండదు. మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారు. ‘టీజర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. టీజర్ కంటే ట్రైలర్, ట్రైలర్ కంటే సినిమా అద్భుతంగా ఉంటుంది. సంక్రాంతి రోజున ఈ సినిమా మీ అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది’ అని డైరెక్టర్ రామ్ అబ్బరాజు చెప్పారు. నరేష్ వీకే, అభిరామి, మురళీ శర్మ, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, సుదర్శన్, సత్య, రోహిణి, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, గోపరాజు విజయ్, బుల్లిరాజు (రేవంత్), శ్రీ ముక్త, రఘుబాబు, మాణిక్ రెడ్డి, హరి ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, మధుమణి, గీతా సింగ్ తదితరులు నటిస్తున్నారు.






కామెంట్లు (0)