Magazines

అమ్మాయిలందరికీ అంకితం

3 గంటల క్రితం

girls
avatar
balaji

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

హీరోలు వెంకటేష్, కల్యాణ్ రామ్ నటిస్తన్న ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘జనవరి 12 విడుదల’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘డివికి డివికి’ ని రిలీజ్ చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ‘‘డివికి డివికి’’ అమ్మాయి లందరికీ అంకితం చేసిన వైబ్రెంట్ సెలబ్రేషన్ సాంగ్. ఫెస్టివ్ ఎనర్జీ, కలర్‌ఫుల్ విజువల్స్, ఆకట్టుకునే రిథమ్‌తో ఈ పాట సాగుతుంది. అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ వదిన, మరదళ్ల మధ్య ఉండే ఆప్యాయత, సరదా సంభాషణలను చాలా అం దంగా చూపించాయి. మధు ప్రియ, హరి ప్రియ తమ ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాన్స్ సీక్వెన్స్‌లను చాలా ఎంగేజింగ్‌గా, విజువల్‌గా ఆకట్టుకునేలా రూపొందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్