Magazines

ఫ్యాన్సీ ఆఫర్‌తో దిల్‌ రాజు సొంతం

1 గంట క్రితం

Dil Raju
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

కథానాయకుడు నాగచైతన్య నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. తాజాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ సినిమా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి, సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్