కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘ఓ మైసా రే’లో రష్మిక చాలా పవర్ఫుల్, ఫెరో షియస్ అవతార్‌లో కనిపించి తన పాత్ర ఎలా ఉండ బోతుందో చూపించారు. మొదటి పాటలోని హై ఎనర్జీ, యాక్షన్ మూడ్‌కు భిన్నంగా ఇప్పుడు మేకర్స్ రెండో పాట ‘ఏనాటి వరమో నువ్వు’ను రిలీజ్ చేశారు. చక్కని మెలోడీ తో పాటు భావోద్వేగాలతో ఈ పాట వినేవారిని ఆకట్టుకుంటోంది. జేక్స్ బిజోయ్ ఈ పాటకు మంచి మెలోడీని అందించారు. వినసొంపైన ట్యూన్‌తో పాటు భావోద్వేగాలు కలిసేలా కంపోజ్ చేశారు. కృష్ణ తేజస్వి తన వాయిస్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.
రెహమాన్ రాసిన లిరిక్స్ ఒక తండ్రికి తన కూతురిపై ఉండే నిస్వార్థమైన ప్రేమను, ఆప్యాయతను చక్కగా తెలియ జేస్తున్నాయి. జీవితంలో అత్యంత స్వచ్ఛమైన, విలువైన బంధాల్లో ఒకటైన తండ్రి, కూతుళ్ల అనుబంధాన్ని ఈ పాట చాలా అందంగా చూపిస్తుంది. పాటలోని ఆప్యాయత, అమాయకత్వం, భావోద్వేగాలు వినేవారిని వెంటనే కనెక్ట్ చేస్తాయి.
ఈ పాటలో మైసా చిన్నప్పటి రోజులను చూపించారు. ఆమె వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో సముద్రఖని, ఈశ్వరీ రావు నటించారు. ఈ భావోద్వేగ సన్నివేశాలకు వీరిద్దరి నటన మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమా ఈనెల 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో రిలీజ్ కానుంది.







కామెంట్లు (0)