Magazines

వినోదం+ సందేశం

1 గంట క్రితం

Message
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్ బ్యానర్ల మీద రాహుల్ వర్మ, కె. వీణా రాణి, కె. హను మంత్ రాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హుషారు 2’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకుడు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్, రాజై రోవన్, అభిజ్ఞ, శ్రీకాంత్ కన్ని, బాబీ రాచకొండ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీ టీజర్‌ని మంగళవారం రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, ‘హర్ష ఇందులో నాకు గొప్ప పాత్రను ఇచ్చారు. ‘హుషారు’లో ఎంత నవ్వించారో.. అంతకు మించి నవ్విస్తూనే, ఆలోచించేలా చేస్తారు. నిరుదోగ్య సమస్యను ఎంతో గొప్పగా చూపిం చారు.

యువతకి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆత్మాభి మానంతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు’ అని అన్నారు. ‘‘హుషారు’ నా జీవితంలో బెస్ట్ మెమోరీ. రెండో పార్ట్‌ని ఏదో తీయాలని తీయలేదు. నా జీవితంలో నా స్నేహితులతో కలిసి చేసిన సంఘటనల ఆధారంగానే ‘హు షారు 2’ తీశాను. నా చిన్ననాటి ఫ్రెండ్ రాహుల్ వర్మ ఈ సినిమాతో నిర్మాణంలోకి వచ్చాడు. నారాయణ మూర్తితో వర్క్ చేయడం ప్రైస్ లెస్ మూమెంట్స్. ఆయనతో ఉండే సీన్స్ థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి’ అని దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి చెప్పారు. నిర్మాత రాహుల్ వర్మ మాట్లా డుతూ,‘‘హుషారు’ నాకు చాలా నచ్చింది. అందులో నా జీవితాన్ని, నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. ‘హుషారు 2’ నేను నిర్మించడం ఆనందంగా ఉంది. సినిమా అందరినీ మెప్పిస్తుందనే నమ్మకంతో మేమంతా ఉన్నాం’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్