విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్‌లో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘డార్క్ చాక్లెట్’.
శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 13న విడుదల కానున్న సందర్భంగా హీరో విశ్వదేవ్ రాచకొండ మీడియాతో సంభాషించారు.
యూఎస్ రివ్యూస్‌కు అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్, ఆడియన్స్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉందని చెబు తున్నారు. అలాగే పర్ఫార్మెన్స్ విష యంలో కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఇంత ఎంగే జింగ్గా ఉన్న సినిమా ఇదే అని చెప్పడం ఆనందాన్ని ఇచ్చింది.
ఇందులో నా పాత్ర పేరు యజ్ఞ. తను ఒక సినిమాలో హీరోగా వరుసగా మూడు హిట్స్ కొట్టి, ఆ తర్వాత కొన్ని అపజయాలు చూసి డౌన్‌ఫాల్‌లో ఉంటాడు. ఈ నేపథ్యంలో తానే ఒక కథ రాయడం మొదలుపెడతాడు. అతనికి పిచ్చి కలలు వస్తుంటాయి. ఆ కలలేంటి? ఆ కలల్లోకి ఎవరు వస్తున్నారు? తన బెస్ట్ ఫ్రెండ్, తన లవ్ ఇంట్రెస్ట్, అలాగే తన బాబాయ్ క్యారెక్టర్‌తో తన జర్నీ ఎలా ఉంటుంది?, నిజం గా వాళ్లు వచ్చారా? లేకపోతే కలలో కనిపించారా? ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లంతా ఇలాంటి సినిమా ఎక్కడా, ఎప్పుడూ రాలేదని చెబు తున్నారు. కచ్చితంగా ఒక కొత్త సినిమా తీశాం. ఇది ఆడియన్స్ అందరికీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది. ఇందులో డైలాగ్స్ చాలా ప్రధానంగా ఉంటాయి.
సర్ప్రైజ్ చేస్తుంది!
18 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)