Magazines

ఐదు భిన్న పాత్రలతో ‘కొక్కొరొకో’

2 గంటల క్రితం

Kokkoroko
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 2 నిమిషాల చదవడం

దర్శకుడు, నిర్మాత రమేష్ వర్మ ఇండస్ట్రీలోకి కొత్త తరాన్ని తీసుకు రావాలనే ఉద్దేశంతోనే ఆర్వీ ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి తొలి ప్రయత్నమైన ‘కొక్కొరొకో’ ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఒక ఆంథాలజీ చిత్రంగా రాబోతోంది. ఈ సినిమాతో శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంగళవారం మేకర్స్‌ ఫస్ట్ సింగిల్‌ ‘సీతాకోకమ్మ’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శీను, పార్వతిల మధ్య ఉన్న సున్నితమైన ప్రేమను ఒక హృద్యమైన బాణీతో అందంగా పరిచయం చేస్తుంది. ఎస్. కృష్ణ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటలో శ్వేతా మోహన్ తన మధురమైన గాత్రంతో ప్రతి స్వరానికి సున్నితత్వాన్ని జోడించారు.

గీత రచయిత చంద్రబోస్ ప్రేమలోని అమాయ కత్వాన్ని ఆవిష్కరించే హృద్యమైన సాహిత్యం ద్వారా ఈ పాటకు అందాన్ని, గొప్ప అర్థాన్ని జోడించారు. ఆహ్లాదకరమైన సంగీతం, సున్నిత మైన రొమాంటిక్ టచ్‌తో 'సీతాకోకమ్మ' పాట శ్రోతల హృదయాల్లో నిలిచిపోయేలా ఉంది. ఈ పాట శీనుపై పార్వతికి ఉన్న సంపూర్ణ ప్రేమను మనకు చూపిస్తుంది. అతని పట్ల ఆమెకున్న ఆప్యాయత, ఆరాటం, భావోద్వేగ బంధాన్ని ఇది అందంగా ప్రతిబింబిస్తుంది. ఈ పాట ప్రేమలోని స్వచ్ఛతను చాటిచెబుతుంది. ఇది శీను, పార్వతిల బంధాన్ని మరింత ఆత్మీ యంగా మారుస్తుంది. ఈ పాటలో హీరో, హీరోయిన్లు ఎంతో సహజంగా కనిపించారు.


వారి మధ్య అందమైన కెమిస్ట్రీ ఈ పాటను మరింత ఆకర్షణీయంగా చేసింది. సున్నితమైన దృశ్యాలు, హృద్యమైన భావోద్వేగాలతో, ఈపాట ఒక అద్భుతమైన ప్రేమకథపై అంచనాలను పెంచు తుంది. శ్రీనివాస్ వసంతల మీదున్న నమ్మకంతో రమేష్ వర్మ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆయనకు అప్పగించారు. భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తారని భావిస్తున్నారు. నేపథ్య గాయకుడు, స్క్రీన్ రైటర్ జి. సత్యమూర్తి కుమారుడు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సోదరుడైన జి.వి. సాగర్ ఈ చిత్రానికి సంభాషణలు అందించడం మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్