Magazines

నా దారి రహదారి..

6 గంటల క్రితం

path
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

రామ్ పోతినేని హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్న సినిమాకి సంబంధించి ప్రీ-లుక్‌ను ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్‌ తో ఇంటర్నేషనల్ మెన్స్‌ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ సినిమా కథ, రామ్ పాత్రపై క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రీ-లుక్ పోస్టర్‌లో రామ్ చాలా మిస్టీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలోని ప్రధాన పాత్రను పరిచయం చేస్తూ ‘లోన్ వుల్ఫ్’ అనే పదానికి మేకర్స్ ఓ ఆసక్తికరమైన నిర్వచనం కూడా ఇచ్చారు. “తన దారిని తానే ఎంచుకుని, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి” అనేది దాని అర్థం. వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, తనదైన ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లే వ్యక్తి చుట్టూ ఈ కథ సాగనుందని ఈ కాన్సెప్ట్ సూచిస్తోంది. ఇది ఇంటెన్స్, క్యారెక్టర్ డ్రివెన్ కథగా ఉండబోతోందనే ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్