Magazines

మహిళా శక్తిని చాటే ‘ఓ మైసా రే’

1 గంట క్రితం

కథానాయిక రష్మిక మందన్న తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

కథానాయిక రష్మిక మందన్న తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైసా’లో పవర్ ఫుల్ పాత్రలో విశ్వ రూపం చూపించనున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది.

ఈ అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ సోమవారం ఈ సినిమా నుంచి తొలి పాట ‘ఓ మైసా రే’ ను విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్, పవర్‌ఫుల్ మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఉరుముల్లాంటి బీట్స్‌తో సాగే ఈ పాట ఆద్యంతం అదే టెంపో, ఎనర్జీని కొనసాగిస్తూ ఎలక్ట్రి ఫైయింగ్ మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం మైసాను ఈషి, ఐషి రూపాల్లో ఆవిష్కరిస్తూ దైవిక స్త్రీ శక్తిని, అర్ధ నారీశ్వర స్వరూపాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళల శక్తి సామర్థ్యాలను కీర్తిస్తూ, ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధం కావాలనే స్ఫూర్తిని ఈ పాటలోని పదాలు బలంగా చాటుతున్నాయి.

సింధూజ శ్రీనివాసన్ తన ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు జోష్‌ను జోడించింది.

‘మైసా’ నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది అని మేకర్స్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్