Magazines

అందమైన చందమామ కథ..

5 గంటల క్రితం

beautiful story
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ‘కరికాల’ మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముగ్గురు కథానాయికలు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ సందడి చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజశేఖర్ తండ్రి వీరభద్రాచారి స్క్రిప్ట్‌ను అందజేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ,‘మా దర్శక, నిర్మాతలు కథ చెప్పడమే రెండు పార్టులుగా ఉంటుందని వివరించారు. ఆరేడు నెలలుగా ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉంటూ వచ్చారు. ఇలాంటి దర్శక, నిర్మాతలు దొరకడం ఆనందంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్ బెస్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మా కథకు ఓకే చెప్పిన సాక్షి, గాయత్రి, కేథరిన్‌లకు థాంక్స్. శ్రీ చరణ్ ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ రెడీ చేస్తున్నారు. ప్రతీ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని తెలిపారు. ‘అందమైన చందమామ కథలా ఈ చిత్రం ఉంటుంది. అందమైన ఊహా ప్రపంచం, నాగలోకం, వానర లోకం అని ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాం’ అని దర్శకుడు యుగంధర్ ముని చెప్పారు. నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ, ‘వచ్చే వారం నుంచి షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. యుగంధర్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించబోతు న్నారు’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్