ఈ నెల 17 వ తేదీ ఉదయం 11 గంటల నుండి హైదరాబాద్ శిల్పకళా వేదికలో బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్-2026 వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. శిల్పకళా వేదికలో చేస్తున్న ఏర్పాట్లను నేటి ఉదయం ఆయన పరిశీలించారు. ఈ ఛాలెంజ్లోని 5 కేటగిరీల్లో ఎంపిక అయిన 35 మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కు అవార్డులు ముఖ్య అతిథులు అందజేస్తారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ .రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, సినిమా రంగ ప్రముఖులు, తదితరులు పాల్గొంటారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 వ యంగ్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ అవార్డ్స్ ఛాలెంజ్-2026 లో భాగంగా 5 కేటగిరీల పోటీలలో పాల్గొనేందుకు 2,670 మంది ఔత్సాహికులు రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ఎంట్రీల పరిశీలన, అవార్డులకు ఎంపికకు ప్రతి కేటగిరీకి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.1)ఫిల్మ్స్, 2)సాంగ్స్, 3)ఫోక్ సాంగ్స్, 4)ఇన్ఫ్లూయెన్సర్స్ కేటగిరీల్లో ప్రతి కేటగిరీలో మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.2 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.1 లక్ష చొప్పున అందజేస్తారు. ఈ 4 కేటగిరీల్లో ప్రతి కేటగిరీలో 5 కన్సోలేషన్ బహుమతుల కింద ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఇస్తారు. అలాగే 5 వ కేటగిరీ ఆర్టికల్స్ కేటగిరీ అవార్డ్స్ కింద ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.3 లక్షలు, రూ. 2 లక్షలు, రూ 1 లక్ష చొప్పున అందజేస్తారు.
ఘనంగా శిల్పకళా వేదికలో అవార్డుల ప్రదానోత్సవం
5 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)