అగ్ర కథానాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్, కాంబోలో ‘భారతీయుడు 3’ రూపొందనుంది. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీకి స్వీకెల్‌గా ‘భారతీయుడు 2, భారతీయుడు 3’ చిత్రాలను కమల్, శంకర్ కాంబోలో రూపొందించటానికి లైకా సంస్థ సిద్ధమైంది. అందులో భాగంగా 2024లో ‘భారతీయుడు 2’ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘భారతీయుడు3’ను చిత్రీకరించటానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంత భాగాన్ని చిత్రీకరించారు. దానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. 10 రోజుల్లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయటానికి షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ముగ్గురు వ్యక్తులు గుర్రాలపై వేగంగా వెళుతుంటే దుమ్ము, దూళి రేగుతున్నట్లుగా ఉండే ఫొటో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ‘భారతీయుడు 3’ ఎలా ఉండబోతుందనే విషయాన్ని ‘భారతీయుడు 2’ క్లైమాక్స్‌లో చూపించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను రూపొందించటంతో పాటు స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్, అధినేత సుభాస్కరన్ ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ మూవీగా ‘భారతీయుడు3’ని మనకు అందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి సేనాపతి లంచాన్ని అంతమొందించటానికి చేసే పోరాటం ఎలా ఉంటుందో బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయాల్సిందే అని అంటున్నారు మేకర్స్.






కామెంట్లు (0)