Magazines

'సూపర్‌ 5' సాంగ్‌ సందడి షురూ..

6 గంటల క్రితం

excitement
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడంతో పాటు, పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్ కృష్ణ ఇప్పుడు దర్శకుడిగా అలరించబోతున్నారు. ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆయన.. ఈ చిత్రానికి రచయితగా, నటుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నారు. సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి ఈ చిత్రాన్ని సహ నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ‘హై’ భావోద్వేగాలు, ఆసక్తికరమైన డ్రామా, ఎనర్జీతో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకులకు ఆకట్టుకునే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ‘హై’ నుంచి ‘సూపర్ 5’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. గ్యాంగ్‌ను పరిచయం చేస్తూ సాగే ఈ పాట అదిరిపోయే ఎనర్జీ, క్యాచీ బీట్‌లతో ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, వికాస్ బడిస ట్యూన్ , అద్వైత్ వోకల్స్ ఎనర్జిటిక్ గా ఉన్నాయి. పిల్లల కోరస్ మరింత ఎనర్జీ జోడించింది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 27న ఈ సినిమా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్