Magazines

థియేటర్లలోనే చూడండి

30 నిమిషాల క్రితం

theaters
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రేక్ష‍కులను మెప్పించిన సినిమా ‘సమ్మర్ హాలిడేస్’. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. శ్రీకర్ దర్శకుడు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దల్ని కూడా ఆకట్టుకుంటూ మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ థ్యాంక్స్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. నటి వాసుకి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు బాక్సాఫీస్ రివార్డ్స్, అవార్డ్స్ ఏవీ ఆశించలేదు. మంచి ఎమోషన్ తో పాటు మెసేజ్ ఉన్న సినిమా చేశాం’ అని తెలిపారు. ‘అరుణ్, రోహన్ ను చూస్తుంటే కమల్, రజినీలా ఉన్నారనే ప్రశంసలు వస్తున్నాయి.

మా సినిమాను థియే టర్స్ లో చూడాలని కోరుతున్నా. మీరు ఎక్కడా డిజప్పా యింట్ కారు. సినిమా నుంచి బయటకు వచ్చేప్పుడు మంచి ఎమోషనల్ ఫీల్ తో వస్తారు’ అని డైరెక్టర్ శ్రీకర్ నయన్ చెప్పారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ,‘ప్రేక్ష‍కులు ఇటువంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే ఎంతో మంది శ్రీకర్ లాంటి దర్శకులు ఇలాంటి మంచి కథలు తెరకెక్కించగలుగుతారు. ఓటీటీలో సినిమా చూసి అభినందిస్తే ఎవరికీ ఉపయోగం లేదు. థియేటర్స్ లో చూస్తేనే మా పర్పస్ నెరవేరుతుంది. పిల్లలతో మా సినిమాకు వస్తే మంచి విషయాలు నేర్చుకుంటారు. పిల్లలకు లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్