డాక్టర్ - పేషెంట్
డాక్టర్: మీకు రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలని చెప్పాను?
పేషెంట్: నాలుగు లీటర్లు డాక్టర్.
డాక్టర్: మరి నేను పరీక్షించి చూస్తే కేవలం ఒక్క లీటరే తాగుతున్నట్లు ఉంది?
పేషెంట్: డాక్టర్ గారూ.. ఆ మిగతా మూడు లీటర్లు నాకు ఎక్కడం లేదు!
నచ్చిన ఊరు
భర్త : భార్యని పోచంపల్లి, ధర్మవరం, ఉప్పాడ ఈ మూడింటిలో నీకేది ఇష్టం?
భార్య : మూడూ ఇష్టమే! మూడు చీరలూ కొనిచ్చెయ్యండి.
భర్త : చీరలా? చీరలేమిటి? నేను చెప్పినది ఊళ్ల పేర్లు! మా ఆఫీసు వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ, ఈ మూడు ఊళ్ళల్లో ఒకటి కోరుకొమ్మన్నారు. నీ అభిప్రాయం కూడా అడగాలి కదా అని అడిగా.
రుణాలు
ఓ రాజకీయ నాయకుడు (సభ ముగిసేక) : ఏంటోయ్ సెక్రటరీ వీళ్ళంతా నా వెనకబడ్డారు?
సెక్రటరీ: వెనుక బడిన వాళ్ళందరికీ ఋణాలిప్పిస్తానని ఇప్పుడు మీరే కద సర్ చెప్పేరు. అందుకని.....
తల వంపులు
తండ్రి (కొడుకుతో): నీ ప్రవర్తనవల్ల నాకెంత తలవంపుగా ఉందో తెలుసా?
కొడుకు: లేదు నాన్నా! నీ తల బాగానే ఉంది. వంపుగా లేదు
దాటి వస్తున్నా...
ఒక వ్యక్తి: ఇంకెప్పుడూ నా గుమ్మం తొక్కొద్దని చెప్పలేదూ నీకు?
రెండో వ్యక్తి: అందుకే గుమ్మం తొక్కకుండా దాటి వస్తున్నాను






కామెంట్లు (0)