నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్‌ఎస్‌యూఐ మాజీ అధ్యక్షులు, అదిలాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు భార్గవ్ దేశ్‌పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఖానాపూర్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)