నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొదటిసారిగా సిక్కు మైనారిటీల కోసం టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఎస్. జస్బీర్ సింగ్ సంధు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్. హర్ ప్రీత్ సింగ్ ను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నియమించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులకు ఆమె నియామక పత్రాలు అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ముస్లీంలు, క్రిస్టియన్లకు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మైనారిటీల్లో ఒక్కో వర్గం సమస్యలు ఒక్కోలా ఉన్నాయనీ, అందుకే వారందరికీ న్యాయం చేసేలా వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా కవిత తెలిపారు.






కామెంట్లు (0)