హాజరుకానున్న రాహుల్ గాంధీ : కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత్ సమ్మిట్ నేపథ్యంలో ఈ నెల14 హైదరాబాద్‌లో నిర్వహించనున్న గిగ్ వర్కర్ల ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలనే డిమాండ్‌ను భారత్ జోడో యాత్రలో రాహుల్ లేవనెత్తారని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే రాష్టంలో ఉన్న 6 లక్షల మంది గిగ్ వర్కర్లకు తెలంగాణలో గిగ్ వర్కర్ల చట్టం తీసుకోచ్చామన్నారు.
ఈ యాక్ట్‌ను రాష్ర్టంలో సక్రమంగా అమలు జరిగేలా నిబంధనలు రూపొందిస్తామని అన్నారు. శిల్ప కళావేదిక నుండి హిక్ సెంటర్ వరకు జరిగే ర్యాలీలో గిగ్ వర్కర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.






కామెంట్‌లు (0)