Magazines

దేశంలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు

1 గంట క్రితం

farmer suicides
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌‌రావు

ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని మధిరలో ఎడ్లబండ్ల ర్యాలీ
భారీగా కదిలొచ్చిన అన్నదాతలు


నవతెలంగాణ-మధిర
దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, అప్పుల భారంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్‌ నుంచి వైఎస్సార్‌ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో రైతులు, కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేసేందుకు నిధులు లేవంటున్న ప్రభుత్వాలు, బహుళజాతి కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు కల్పించడం అన్యాయమన్నారు.

వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను ప్రభుత్వాలు వీడాలని డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 15 నుంచి 18 వరకు నల్లగొండ పట్టణంలో జరగనున్న ఏఐకేఎస్‌ మహాసభల్లో రైతు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, ఎరువులు, పురుగుమందులపై ఆంక్షల తొలగింపు, బేషరతుగా ఉచిత విద్యుత్‌ సరఫరా, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్న‌ట్టు తెలిపారు. రైతు, పేద ప్రజల అనుకూల విధానాల సాధనకు ఈ మహాసభలు దోహదపడతాయన్నారు. జాతీయ మహాసభల సందర్భంగా జరిగే బహిరంగసభలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్య దర్శులు మాదినేని రమేష్‌, బొంతు రాం బాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్