Magazines

అగార్కర్ కు ఘనంగా వీడ్కోలు పలికిన బీసీసీఐ

20 గంటల క్రితం

BCCI bids farewell to Agarkar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత పురుషుల క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం ముగిసింది. మంగళవారంతో ఆయన బాధ్యతలు అధికారికంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత క్రికెట్‌కు అగార్కర్‌ అందించిన సేవలను కొనియాడుతూ బీసీసీఐ బుధవారం ధన్యవాదాలు తెలిపింది. అగార్కర్‌ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్‌ టైటిళ్లు సాధించడంతో పాటు వరుసగా రెండు ఏషియన్‌ గేమ్స్‌ స్వర్ణాలు గెలిచిందని బీసీసీఐ పేర్కొంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడం కూడా ఆయన పదవీకాలంలోని కీలక ఘట్టంగా గుర్తుచేసింది. వెస్టిండీస్‌ పర్యటనకు జట్ల ఎంపిక అగార్కర్‌కు చివరి బాధ్యతగా నిలిచింది. ప్రస్తుతం మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం సెలక్షన్‌ కమిటీలో అత్యధిక టెస్టులు ఆడిన సభ్యుడు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. 24 టెస్టులు ఆడిన ఓజా.. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేశారు. కమిటీలో శివ్‌ సుందర్‌ దాస్‌, అజయ్‌ రాత్రా, ఆర్పీ సింగ్‌ సభ్యులుగా కొనసాగుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్