నవతెలంగాణ-హైదరాబాద్ : ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రబీ సీజన్లో వరి సాగు చేయవద్దని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రైతులకు సూచించారు. సోమవారం రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలోని 315 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, త్వరలో కరువు మండలాలను ప్రకటిస్తామని తెలిపారు. నీటిని పొదుపుగా వాడుతూ పామ్ తోటలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.






కామెంట్లు (0)