నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో వానాకాలం సీజన్లో రూ.20 వేల కోట్ల మేర పంట నష్టం జరిగి ఉండొచ్చని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంచనా వేసింది. సాగు విస్తీర్ణం 25–30 శాతం తగ్గినట్లు పేర్కొంది. యాసంగిలో వరికి బదులుగా శనగ, కందులు, పొద్దుతిరుగుడు, ఇతర నూనెగింజలు, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించింది. రబీలో వరి సాగును తగ్గిస్తే భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.






కామెంట్లు (0)