Magazines

ఓటర్లను తొలగించేందుకు జ్ఞానేష్ కుమార్‌ అత్యుత్సాహం: పినరయి విజయన్

1 గంట క్రితం

Pinarayi Vijayan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌లపై కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మంగళవారం కేరళంలోని కోజికోడ్ జిల్లా సీపీఐ(ఎం) విస్తృత స్థాయి కమిటీ సమావేశ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ, ఎన్నికల సంఘం విశ్వసనీయత, నిష్పాక్షికత తీవ్రమైన ప్రశ్నార్థకంగా మారాయని విజయన్ పేర్కొన్నారు. దాని నిష్పాక్షికత, విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలు తలెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.


"SIR ప్రక్రియలో అనేక తప్పిదాలు జరిగాయని, జ్ఞానేష్ కుమార్ తన బాధ్యతలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడం లేదు. ఆ పదవిలో ఉంటూ ఆయన చేసిన పనులు RSS కోరుకున్న విధంగానే ఉన్నాయి, ఓటర్ల జాబితా నుండి కోట్లాది మంది ఓటర్ల పేర్లను తొలగించేందుకు "అత్యుత్సాహం" చూపారని, "ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టడానికి జ్ఞానేష్ కుమార్ అర్హుడు కాదని స్పష్టమైంది." అని విజయన్ ఆరోపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్