బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తేప్ప తుకారాం
నవతెలంగాణ-మద్నూర్
రైతులకు కావలసిన తర్పన్ టైల్స్ కాగితాలను, సోయా పంటను చెల్నీ చేసుకోవడానికి మిషన్లు ఇవ్వాలని, హమాలీలు మాత్ర పేరుతో దోచుకునే దోపిడీని అరికట్టాలని మద్నూర్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు తెప్ప తుకారం అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ యార్డులో సోయా పంటను ఆరబెట్టుకోవడానికి తర్పన్ టాయ్స్ కాగితాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా చల్ని మిషన్లు ఇస్తే పంట దోపిడీకి గురికాకుండా రైతులను ఆదుకోవాలని మార్కెట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మద్నూర్ మార్కెట్ పరిధిలో కొనుగోలు జరుగుతున్న వాటిలో హమాలీలు మాత్ర పేరుతో దోచుకుంటున్నారని, ఒక్కొక్క రైతు వద్ద దాదాపు 20 ,25 కిలోల చొప్పున పంట అధికంగా ఉన్న వాటిలో మరింత అధికంగా దోచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దోపిడీని మార్కెట్ కమిటీ అధికారులు అరికట్టాలని ఆయన కోరారు. వ్యవసాయదారులను మార్కెట్ కమిటీ అధికారులు అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)