నవతెలంగాణ-మల్హర్ రావు
ఎమ్మార్పీఎస్-టిజిఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 9న యువతకు జాబ్ మేళా నిర్వహించునట్లుగా ఎమ్మార్పీఎస్-టిజి మండల ఉపాధ్యక్షుడు ఇకదారపు మొగిలి మాదిగ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లుగా తెలిపారు.మండలంలోని అర్హత కలిగిన యువతీ,యువకులు ఈజాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో హాజరై తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆయన కోరారు.డిగ్రీ,పీజీ, ఎంబీఏ వంటి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు మెగా జాబ్ మేళాకు హాజరై వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను పరిశీలించవచ్చని తెలిపారు.







కామెంట్‌లు (0)