Magazines

ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ బంద్‌

1 గంట క్రితం

Internet shutdown in several areas of Delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఓటు చోరీ, సీఈసీకి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌, మొబైల్‌డేటా సేవలు పనిచేయడం లేదు. ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ర్యాలీ, ఈసీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు చేపట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కాసేపట్లో మకరద్వారం నుంచి నిర్వాచన్‌ సదన్‌ వరకు ఎంపీలు ర్యాలీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ఆంక్షలు విధించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్