నవతెలంగాణ - హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆదివారం సాయి ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, ప్లాస్టిక్ వస్తువులు పెద్ద ఎత్తున దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలోని మిర్చి కోల్డ్ స్టోరేజీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)