Magazines

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌ చార్జీలపై పునఃసమీక్ష : మంత్రి పొన్నం

1 గంట క్రితం

Re-review of RTC-Metro common pass charges: Minister Ponnam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌ చార్జీలను తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షించనుంది. ప్రస్తుత ధరలు సామాన్యులకు భారంగా ఉన్నాయంటూ ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రస్తుతం రోజువారీ పాస్‌ ధర రూ.400, నెలవారీ పాస్‌ ధర రూ.8,500గా ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల మేరకు చార్జీలను పునఃపరిశీలించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ధరలపై త్వరలోనే ఉన్నతాధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్