నవతెలంగాణ - హైదరాబాద్ : సినీ తారల రాకతో వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం సందడి నెలకొంది. కొత్తకోట రోడ్డులో గరుడ వస్త్ర సిల్క్స్ నూతన షోరూమ్‌ను సినీనటి భాగ్యశ్రీ బోర్సే ప్రారంభించగా, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (సీబీఎస్)లో దసరా డబుల్ ధమాకా సేల్‌ను సినీనటి పాయల్ రాజ్‌పుత్ ప్రారంభించారు. ఒకేరోజు ఇద్దరు సినీ తారలు రావడంతో వారిని చూసేందుకు అభిమానులు, యువత భారీగా తరలివచ్చారు. దీంతో కొత్తకోట రోడ్డు జనసందోహంతో కిక్కిరిసింది.







కామెంట్‌లు (0)